AP: ఫ్రైడ్ రైస్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి 7 గంటలకు లహరి, ప్రణతి ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటామని ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఎంత సేపైనా బాలికలు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.