ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజు చేయాలనేదే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం(D) కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయిన ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తోందని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందన్నారు.