రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసిందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని విమర్శించారు. పక్కాగా పకడ్బందీగా కులగణనను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిది. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి BRS నేతలు ఇప్పుడు మాట్లాడడం అవివేకం' అని మండిపడ్డారు.