TG: బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, చేతులు దులిపేసుకునే కార్యక్రమం చేసిందని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీల లెక్క తప్పిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందని అన్నారు.