తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు స్టూడెంట్ పాస్‌లు కేవలం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే వర్తించేవి. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ స్టూడెంట్ పాస్‌లను ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆనందం నింపింది. దీంతో ప్రయాణ ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.