మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూం ఇల్లుతో పాటు రూ.25,000 చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూవీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని చోట్ల కూల్చివేతలను ప్రారంభించింది. నిర్వాసితులను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలించింది.