నమ్మి ఓటేసినందుకు.. ప్రభుత్వం రైతుల గొంతు కొస్తోంది: హరీష్ రావు(వీడియో)

73చూసినవారు
TG: నమ్మి ఓటేసినందుకు.. కాంగ్రెస్ సర్కారు రైతుల గొంతు కోస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని ఎక్స్ వేదికగా స్పందించారు. కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేసి.. పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే 20 రోజులు గడిచినా ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. దీంతో అకాల వర్షం కారణంగా పండించిన ధాన్యమంతా తడిసి ముద్దయిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్