తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి గవర్నర్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తాజాగా నిర్వహించిన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అసెంబ్లీకి వచ్చి ప్రసంగించకుండానే వెళ్లిపోవడం చిన్న పిల్లల చేష్టల మాదిరి ఉన్నాయని, ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేకపోయారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.