నేరేడు పండ్లు అనేక చర్మ సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి డయాబెటీస్‌ను కూడా చాలా మేరకు నియంత్రిస్తాయి. నేరేడు పండ్ల వల్ల దంతాలు, చిగుర్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా మలబద్ధకం, విరోచన వంటి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.