తెలంగాణ కేబినెట్‌లోకి కొత్తగా ఎవరికి అవకాశం కల్పించాలో అధిష్ఠానానికి తెలుసని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమ కుటుంబం గురించి కాంగ్రెస్ పార్టీకి అంతా తెలుసని, ప్రేమ్ సాగర్ నిరాధార ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మరని పేర్కొన్నారు. తన తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీకి 70 ఏళ్లు సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.