TG: మిస్ వరల్డ్ పోటీదారుల ముందు రాణి రుద్రమదేవి చరిత్ర ప్రదర్శించారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో ప్రపంచసుందరీమణుల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాకతీయ వంశంలో ధృవతారగా వెలిగిన రాణి రుద్రమదేవి చరిత్రను ప్రతిబింబించేలా నృత్యప్రదర్శన చేశారు. రుద్రమదేవి ధైర్య సాహసాలతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన తీరు, ప్రతిభాపాఠవాలను ప్రపంచ సుందరీమణులకు తెలిసేలా కార్యక్రమం చేశారు.