మొహర్రం అంటే ఒక పండుగ కాదు.. ఇది అమరవీరుల త్యాగాలను, 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని గుర్తు చేసుకోవడం కోసం నిర్వహించుకునే పవిత్రమైన రోజు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రాణం మీదకు వచ్చినా సత్యం, ధర్మం వదలకూడదని మొహర్రం మాసం హితబోధ చేస్తుంది. ముస్లింలు విశ్వసించే హిజ్రీ క్యాలెండర్ నూతన సంవత్సరమే ఈ మొహర్రం.