పని గంటలపై పలువురు కార్పొరేట్ దిగ్గజాలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రోజుకు 12 గంటలు, అంతకుమించి కూర్చుని పనిచేసే వారు తీవ్ర నిస్పృహ లేదా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు ఇటీవల ఆర్థిక సర్వే వెల్లడించింది.