తెలంగాణలో భారీ రైలు ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా నల్గొండ స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు మరో ఇంజిన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. స్టేషన్‌కు వచ్చాక ఇంజిన్ ఫెయిల్ అయ్యిందని, స్టేషన్ బయట జరిగి ఉంటే మరో రైలు ఢీకొనే ప్రమాదముందని అధికారులు తెలిపారు. రైలు పునరుద్ధరణ పనులు చేపట్టారు.