TG: హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు యువతులు ఒంటరిగా ఉన్నట్లు నటిస్తూ వాహనదారులను లిఫ్ట్ అడిగి పర్సు, ఫోన్ కొట్టేస్తున్నారు. దొరికితే వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తుండగా.. మరి కొందరు చాటింగ్ పేరిట దగ్గరై చివరకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్ నుంచి రూ.లక్ష కొట్టేసిన యువతి.. మరొకరిని మోసం చేయబోయి పోలీసులకు చిక్కింది.