పార్లమెంట్ అరుదైన సందర్భానికి వేదిక కానుంది. ఫిబ్రవరి 15న రామాయణం:ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ.రామ సినిమాను పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా గీక్ పిక్చర్స్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్వీకర్స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం దీనికి హాజరుకానున్నారు. ఇది మాకు ఎంతో స్పూర్తినిస్తుంది అని గీక్ పిక్చర్స్ ఇండియా వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ ప్రకటించారు.