లింగమంతు స్వామి శాఖాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగితా దేవతలకు జంతుబలులు ఇస్తారు. పురుషులు ఎరుపురంగు వస్త్రాలు ధరించి, కాళ్లకు గజ్జెలు కట్టుకొని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ నడుస్తూ ఓలింగా.. ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. పిల్లలు లేనివారు స్నానం చేసి తడిబట్టలతో గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్మకం.