బైక్‌ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్

52309చూసినవారు
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం భయాభంత్రులకు గురి చేస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఓ లారీ బీభత్సం సృష్టించింది. రాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టి, అలాగే కిలో మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో బైక్ నడిపే వ్యక్తి అప్రమత్తం కావడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. కానీ ఆ ద్విచక్రవాహనాదారుడు తన బైక్ ను కాపాడుకోవడానికి, ఆ లారీ డ్రైవర్ ను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి లారీ డోర్ పట్టుకొని వేలాడాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్