ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారిని ఆ లారీ డ్రైవర్ చంపేందుకు ట్రై చేశాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో జరిగింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించి రాంగ్ లైన్‌లో ముందుకు దూసుకెళ్లాడు. పోలీస్ అధికారి అడ్డుకునేందుకు ఆ వాహనం ముందుకు రాగా, డ్రైవర్ లారీని ఆపలేదు.