గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన లక్కీ నంబర్ "1206". ఆయనకు చెందిన అన్ని పర్సనల్ వెహికల్స్‌కి ఇదే నంబర్‌తో ఉండేవని జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఆయన చనిపోయిన రోజు కూడా 12/06 (జూన్ 12) కావడం గమనార్హం. ఆయన అదృష్టంగా భావించిన సంఖ్యే దురదృష్టానికి దారితీసిందని, లక్కీ నెంబర్ కాస్త అన్ లక్కీ అయిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.