టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ –2 డిపో అధికారులు 2025 జనవరి 6 నుంచి ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు. అయితే కొత్త బస్సుల్లో సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ టికెట్‌లకు అనుమతి ఉందని అధికారులు చెప్పినప్పటికీ... టికెట్ ఎక్కువ తీసుకుంటారానే భయంతో మహిళలు ఆ బస్సులు ఎక్కడానికి భయపడుతున్నారు. దీంతో డిపో అధికారులు బస్సుల బానెట్‌కు ముందు 'ఈ బస్సులకు మహాలక్ష్మీ టికెట్ వర్తించును' అనే స్టిక్కర్లను అంటించారు.