TG: మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధురాలైన యజమానిని ఇంట్లో పని చేసే పనిమనిషి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60)ని ఏప్రిల్ 11న హత్య చేసినట్లు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.