బాలయ్య నటించిన 'డాకు మహారాజ్' సినిమా ఈ నెల 12వ తేదీ (ఆదివారం) థియేటర్లలో విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా మేకింగ్ వీడియోను మూవీ టీమ్ తాజాగా విడుదల చేసింది. బాలకృష్ణతో పాటు DOP విజయ్ కార్తీక్ కన్నన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టారని, ప్రేక్షకుల అంచనాలకు మించేలా సినిమా ఉండనుందని బాలకృష్ణ పేర్కొన్నారు.