
అకౌంట్లలోకి రూ.2వేలు.. పడేది అప్పుడేనా?
PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. జులై 18న నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈనెల 20న ప్రధాని మోదీ బిహార్లో పర్యటించనున్నారు. మోదీ పర్యటనకు 2 రోజుల ముందే PM కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.