27 ఏళ్ల నాటి నుంచే విమానంలో ‘11ఎ’ సీటు మిస్టరీ

71చూసినవారు
27 ఏళ్ల నాటి నుంచే విమానంలో ‘11ఎ’ సీటు మిస్టరీ
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికిబయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్‌కుమార్ రమేశ్. అతడి సీటు '11 ఎ' గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తాజాగా ఈ సీటు గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 1998లో తాను కూడా అదే నంబర్ సీటులో ప్రయాణించి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగానని థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్‌సక్ లాయ్‌చూజాక్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా గుర్తు చేసుకోవడంతో ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్