పశ్చిమ బెంగాల్‌లోని శిలిగుడి సఫారీ పార్కులో సింహాల పేర్ల వివాదానికి ప్రభుత్వం ముగింపు పలికింది. అక్బర్, సీతగా ఉన్న మగ, ఆడ సింహాల పేర్లను సూరజ్, తాన్యాగా మారుస్తున్నట్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రెండు సింహాల పేర్లు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పెట్టారంటూ విశ్వహిందూపరిషత్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.