తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, కొట్టారం ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. మెకానిక్ కన్నన్ అనే వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో విడిపోయిన తరువాత, మ్యారేజి బ్రోకర్ ద్వారా తెన్కాసికి చెందిన 25 ఏళ్ల దేవిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన మొదటి రాత్రినే వధువు భర్తకు షాక్ ఇచ్చింది. తొలిరాత్రి రోజు భర్తతో గడపకుండా, మరుసటి రోజు అతను పనికి వెళ్ళగానే పారిపోయింది. కన్నన్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.