కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో పేదలు పెరిగిపోతున్నారని, అలాగే సంపద కొంతమంది చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిని అధికమించడానికి ఉద్యోగాలు సృష్టించే, ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చే ఆర్థిక వ్యవస్థ గురించి పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం టోల్ గేట్ల ద్వారా రూ.55 వేల కోట్లు సంపాదిస్తున్నామని, రాబోయే రెండేళ్లలో రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని గడ్కరీ అంచనా వేశారు.