మహారాష్ట్రలోని గడ్చిరోలిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. భట్‌పర్ గ్రామానికి చెందిన 67 ఏళ్ల గిరిజనుడు మల్లు మజ్జి గురువారం పొలంలో పని చేస్తుండగా గాయపడ్డాడు.దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని మంచంపై మోశారు. పడవలో నీటి ప్రవాహాన్ని దాటారు. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ నదిపై వంతెన లేకపోవడంతో ఆ గ్రామస్తులకు ఈ అవస్థలు తప్పడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.