తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 20 గంటల పాటు వేచి చూస్తున్నారు. కంపార్ట్‌మెంట్లతో పాటు సేవా సదన్ వరకూ క్యూలైన్లు విస్తరించాయి. నిన్న ఒక్కరోజే 91,720 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. 44,678 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.