సిద్ధిపేటలో పుట్టిన గులాబీ జెండా రజతోత్సవం జరుపుకుందని BRS నేత హరీశ్ రావు కొనియాడారు. సిద్దిపేటలో జరిగిన యువ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. BRS ఆవిర్భావ రజతోత్సవం సందర్బంగా పాదయాత్ర చేసిన యువ విద్యార్థులను ఆయన సన్మానించారు. 'సిద్ధిపేట నుండి వరంగల్ వరకు పాదయాత్రగా వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. ఇంత సుదీర్ఘ పాదయాత్రను ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విజయవంతం చేసిన మీకు ఏం చేసినా తక్కువే' అని వ్యాఖ్యానించారు.