జానీ మాస్టర్ భార్యపై కేసు, అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు

83చూసినవారు
జానీ మాస్టర్ భార్యపై కేసు, అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆయన భార్య ఆయేషాపై కూడా కేసు నమోదు చేసేందుకు నార్సింగ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌ ఇంటికి వెళ్లి.. ఆమెపై దాడి చేసిందంటూ ఆయేషాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయేషాతో పాటు మరో ఇద్దరిపై వేరుగా కేసు నమోదు చేసి అవసరమైతే అరెస్ట్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్