కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం అవుతున్నారని చెప్పారు. దీనిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆశాస్త్రీయంగా, అసంబద్ధంగా చేశారని విమర్శించారు. ఇప్పుడు కుల గణన లెక్కల గురించి అడిగే హక్కు BRSకు లేదన్నారు.