ఉల్లి ఘాటు తెలుగు రాష్ట్రాలకు తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా.. గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుతం రైతు బజార్లలో కిలో ఉల్లి రూ. 60-80 మధ్య పలుకుతోంది. మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కర్నూలులో ఉల్లి సాగు విస్తీర్ణం 75 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పడిపోయింది. దీంతో సామాన్యులు ఉల్లి కొనేందుకు జంకుతున్నారు.