దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. కాసేపటికే ఆయన తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. ఓ కార్యకర్త అసౌకర్యంగా ఉండడమే అందుకు కారణం. అది గుర్తించిన ప్రధాని అతడికి కాస్త మంచి నీటిని అందించాలని అక్కడున్న వారికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రసంగించి.. ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు.