ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్

74చూసినవారు
ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్
జార్ఖండ్‌ హజారీబాగ్‌లోని షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న షాహిద్ అన్సారీ అనే ఖైదీని ఇటీవల హజారీబాగ్ సెంట్రల్ జైలుకు తరలించారు. అస్వస్థతకు గురైన షాహిద్ 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రి సెక్యూరిటీ గార్డును చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్