TG: వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలందరూ ఉద్యమంలా కదిలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని, రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేటీఆర్ పిలుపుతో కార్యకర్తలు, నేతలు అందరూ సభకు సిద్ధమయ్యారని వెల్లడించారు.