తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఆరు శాఖలకు మంత్రుల నియామకం లేదు. కొత్తగా చేరిన వారికి మంత్రి పదవులు ఇస్తూ, పాత నాయకులను పక్కనపెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు అయితే "మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి చివరికి మోసం చేశారు" అని బహిరంగంగానే ప్రస్తావిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మంత్రి పదవులు లేకపోతే ఓట్లు సంపాదించడం కష్టమని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.