తెలంగాణ బీజేపీ పగ్గాలు ఆ బీసీ నేతకే!

82చూసినవారు
తెలంగాణ బీజేపీ పగ్గాలు ఆ బీసీ నేతకే!
TG: ఢిల్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు తెలంగాణపై ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపైన దృష్టి సారించింది. అయితే అన్ని జిల్లాల నాయకులను కలుపుకొని ముందుకెళ్లే మాస్‌ లీడర్‌, అందులోనూ బీసీ నేతకు ఇస్తే బాగుంటుందని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అధ్యక్షుడిగా ఎంపీ ఈటల రాజేందర్‌ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్