భూముల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి పొంగులేటి

62చూసినవారు
భూముల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి పొంగులేటి
TG: రాష్ట్రంలో రైతుల భూముల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ధరణిని బంగాళాఖాతంలో వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మూడు మండలాల్లో భూములపై ప్రజల నుంచి మాన్యువల్‌గా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తాం. జూన్ 2 కల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం’ అని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్