కొన్నేళ్ల పాటు ఒకే భూమిలో వరిని ఏకరీతి పంటగా పండించడం వల్ల నేల అడుగు భాగంలో గట్టి పొరలుగా ఏర్పడి నీరు లోపలికి ఇంకే సామర్థ్యం తగ్గిపోతుంది. దీని వల్ల వరి తర్వాత వేసే పంటకు నష్టం వాటిల్లుతుంది. 33 ప్రాంతాల్లో దీర్ఘకాలంగా వరి పండించినప్పుడు 25 ప్రాంతాల్లో వరి దిగుబడి తటస్థంగానూ, 8 ప్రాంతాల్లో ఆశించిన దానికంటే తక్కువగానూ దిగుబడులు నమోదైనట్లు పరిశోధనల్లో తేలింది.