ఏపీలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్ జిల్లా కాశినాయక మండలంలో ఓ మహిళ హత్యాచారానికి గురైంది. కరీమున్నీసా (32) ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్ చేస్తుంటారు. గత బుధవారం రాత్రి అనూహ్యంగా కరీమున్సీసా హత్యకు గురయ్యారు. ముఖంపై బండరాయితో బాదడంతో ఆమె తల నుజ్జునుజ్జు అయింది. మేకల కాపరులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెపై సామూహిక హత్యాచారం జరిగినట్లు గుర్తించారు. దర్యాప్తు జరుగుతోంది.