బీహార్‌లోని ఛప్రా నగరంలో మంగళవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. మహావీర్ మేళా సందర్భంగా డ్యాన్స్ ప్రదర్శన నిర్వహించారు. దీనిని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. చుట్టు పక్కల భవనాలపైకి వందల సంఖ్యలో ప్రజలు చేరారు. అయితే డ్యాన్స్ చూస్తుండగా ఓ బిల్డింగ్ పైకప్పు కూలిపోయింది. దానిపై నిలబడ్డ వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.