AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లని నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. అయితే, మంగళవారం శ్రీనివాసుడిని 80,894 మంది భక్తులు దర్శించుకోగా.. 32, 508 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.3 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి.