టన్నెల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది: మంత్రి జూపల్లి

81చూసినవారు
నాగర్‌కర్నూల్‌లోని SLBC టన్నెల్‌లో పరిస్థితి దారుణంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారు బతికే అవకాశం లేదని చెప్పారు. 'SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం కష్టంగా ఉంది. ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నీటి తీవ్రత ధాటికి టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ కొట్టుకొచ్చింది.ఒక కిలో మీటర్ మేర నీరు, బురద ఉన్నాయి. రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తుంది' అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్