ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కోట్ల మంది పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే 50 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ గవర్నమెంట్ ప్రకటించింది. అయితే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. మహాకుంభమేళాకు రూ.1500 కోట్లు ఖర్చు పెడితే.. రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.