ప్రిన్సిపల్‌ను కాల్చి చంపిన విద్యార్థి

61చూసినవారు
ప్రిన్సిపల్‌ను కాల్చి చంపిన విద్యార్థి
ప్రిన్సిపల్‌ను గన్‌తో కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఛతర్‌పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే సక్సేనా(55) ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆయనను 12వ తరగతి విద్యార్థి గన్‌తో కాల్చాడు. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో సక్సేనా అక్కడికక్కడే మరణించారు. అయితే ప్రిన్సిపల్ వారిని మందలించినందుకే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్