నియంత్రణ లేని ఆయుధ తయారీ, వాటి విచ్చలవిడి విక్రయాలు ప్రపంచ శాంతిని పెను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 5న ‘అంతర్జాతీయ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అవగాహన డే’గా ఐక్యరాజ్య సమితి పాటిస్తోంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని విశ్వశాంతికి, మానవాళి అభ్యున్నతికి ఉపయోగించాలని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఆయుధాలను విడిచి మానవజాతి శాంతి పథాన ముందుకు సాగాలి.