రైతుపై దాడి చేసిన పులి.. తీవ్ర గాయాలు

78చూసినవారు
రైతుపై దాడి చేసిన పులి.. తీవ్ర గాయాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న ఓ మహళపై దాడి చేసి చంపిన పులి.. తాజాగా మరో రైతుపై దాడి చేసింది. సిర్పూర్(టీ) మండలం దుబ్బగూడ గ్రామంలో సురేశ్ అనే రైతు కంది చేనులో ఉండగా దాడి చేసింది. రైతుకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కాగా అటవీ శాఖ అధికారులు పులి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.

సంబంధిత పోస్ట్