'నేను ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు' అన్నారు ఒక మహా కవి. గంట, రెండు గంటల పాటు రైళ్లు ఆలస్యం సర్వ సాధారణం. అయితే ఓ రైలు ఏకంగా 72 గంటలు లేటుగా వచ్చింది. అనధికారిక వివరాల ప్రకారం.. కోటా నుంచి పట్నా వెళ్లాల్సిన 13228 నంబర్ రైలు 2017లో 72 గంటలు లేటుగా వచ్చింది!. రైల్వే అధికారిక వివరాల ప్రకారం ఆ చెత్త రికార్డు మహానంద ఎక్స్ప్రెస్ (2014లో 71 గంటలు) పేరిట ఉంది.